కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్! 13 d ago
రామ్‌కీ ఫౌండేషన్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేపట్టే బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలను ఆశిస్తున్న ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నాయి. ఈ రెండు ఫౌండేషన్లు సంయుక్తంగా పోటీ పరీక్షల శిక్షణనిచ్చే శ్రీధర్ సీసీఈ సెంటర్‌తో కలిసి అర్హత పరీక్షను నిర్వహించనున్నాయి. దీనిలో అర్హత సాధించిన 250 మందికి గుంటూరు జిల్లా పెదపరిమి (అమరావతి) గ్రామంలోని రాంకీ ఫౌండేషన్ స్కిల్ సెంటర్‌లో కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ అర్హత పరీక్షను డిసెంబర్ 22న తెలుగు రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఫలితాలను డిసెంబర్ 25న ప్రకటించి, డిసెంబర్ 28న శిక్షణను ప్రారంభిస్తారు. వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌తో పాటు ఆన్‌లైన్ మోడల్ పరీక్షలు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు 7337585959, 9000797789ని సంప్రదించవచ్చు.